Voiceandhra.com

Voiceandhra.com
Andhra News,Telugu Cinema News,AP Political News,AP News

Monday, February 28, 2011

జూ.ఎన్టీఆర్ శక్తి చిత్రం నైజాం రైట్స్ రికార్డు స్దాయి అమ్మకం


జూ ఎన్టీఆర్ తాజా చిత్రం శక్తి ..నైజాం రైట్స్ నైజాంలో పదికోట్ల రూపాయల వరకూ అమ్ముడయినట్లు తెలుస్తోంది. అది కూడా చాలా పోటీ మీద సిరి మీడియా సంస్ధ సొంతం చేసుకుంది. దాంతో మిగతా ఏరియాల్లో కూడా క్రేజ్ మొదలైంది. ఈ చిత్రం పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈనెల 27న పాటల్ని లలిత కళా తోరణంలో గ్రాండ్ గా పంక్షన్ చేసి విడుదల చేస్తారు.అందుకోసం ఎన్టీఆర్‌ అభిమానులకు ప్రత్యేక ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. అలాగే మార్చి 30న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

శక్తి చిత్రంలో బాలీవుడ్ నటి పూజా బేడీ ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ... శక్తి తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద బడ్జెట్ చిత్రం. ఇందులో నాకు సూపర్ నేచురల్ పవర్స్ ఉంటాయి. ఈజిప్టు యువరాణిగా నేను అలరిస్తాను అన్నారామె.అలాగే ఈ చిత్రంలో స్పెషల్ ఎఫెక్టులు,గ్రాఫిక్స్ అధ్బుతంగా ఉంటాయని అన్నారామె. మోహన్ బాబు చిత్రం చిట్టెమ్మ మొగడు తర్వాత ఆమె తెలుగులో చేస్తున్న చిత్రం ఇదే.

ప్రభు, పవిత్రాలోకేష్, ప్రగతి, కృష్ణభగవాన్, అలీ, వేణుమాధవ్, నాజర్ తదితరులు ఇతర ప్రాతల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సత్యానంద్, రచనా సహకారం: యండమూరి జె.వి. భారతి, తోటప్రసాద్, డీఎస్ కన్నన్, ఆర్ట్: ఆనంద్‌సాయి, కెమెరా: సమీర్ రెడ్డి, సమర్పణ: సి. ధర్మరాజు, స్క్రీన్ ప్లే.. దర్శకత్వం: మెహర్ రమేష్.

నా జీవిత కోరిక నెరవేరుతోంది


తెలుగులో ఉన్న స్టార్ హీరోల్లో మణిరత్నం దర్శకత్వంలో నటించిన క్రెడిట్ ఒక్క నాగార్జునకు మాత్రమే ఉంది. త్వరలో అటువంటి అదృష్టం ప్రిన్స్ మహేష్‌బాబుకు కూడా సొంతం కానుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. మణిరత్నం దర్శకత్వంలో మహేష్ ఓ సినిమాలో నటించనున్నట్టు, అందులో మరో హీరోగా విక్రమ్ కూడా ఉన్నట్లు, చరిత్రాత్మక కథాంశంతో ఈ సినిమా రూపొందనున్నట్లు గతంలో కొన్ని వార్తలొచ్చిన విషయం తెలిసిందే.

అయితే... మహేష్ ఈ వార్తల విషయంలో అప్పుడు స్పందించలేదు. కానీ, తాజాగా తన ట్విట్టర్‌లో ఆయన పోస్ట్ చేసిన మెసేజ్ గతంలో వచ్చిన వార్తలకు బలాన్ని చేకూర్చినట్లయింది. ‘‘నా జీవితంలో గొప్పగా భావించే న్యూస్‌ని అభిమానులకు చెప్పబోతున్నాను. ఇటీవలే మణిరత్నం సార్‌ని కలిశాను. ఆయన లెజెండ్రీ డెరైక్టర్. తనతో సినిమా చేయాలనే నా చిరకాల వాంఛ నిజం కాబోతోంది.

త్వరలో మా కాంబినేషన్‌లో ఓ సినిమా రానుంది. నా జీవితంలో మరచిపోలేని సినిమా ఇది. ఎంతో ఆనందానికి లోనవుతూ ఈ వార్తను పోస్ట్ చేస్తున్నాను’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు మహేష్. ఈ వార్త సూపర్‌స్టార్ అభిమానులకే కాదు. అభిరుచి గల తెలుగు ప్రేక్షకులకు కూడా శుభవార్తే. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఉంటుందని సమాచారం.

5న తారల క్రికెట్ కర్టెన్ రైజర్


ఉత్తరాది, దక్షిణాది సినీ తారలు ఆడనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 'కర్టెన్ రైజర్' గేమ్ ఈ నెల 5న విశాఖపట్నంలో జరుగనున్నది. ఈ మ్యాచ్‌లో బాలీవుడ్ తారల జట్టుతో, దక్షిణాది తారల జట్టు తలపడనున్నది. ఈ సంగతిని ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో సోమవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో టాలీవుడ్ టీమ్ యజమాని హీరో మంచు విష్ణు తెలిపారు. సౌత్ సూపర్‌స్టార్స్ లెవన్ జట్టుకి హీరో వెంకటేశ్ కెప్టెన్‌గా, కన్నడ హీరో సుదీప్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

ఈ జట్టులో టాలీవుడ్‌కు చెందిన మంచు విష్ణు, సిద్ధార్థ్, తరుణ్, తారకరత్న, తమిళ హీరోలు సూర్య, శరత్‌కుమార్, అబ్బాస్, ఆర్య, శ్యామ్, శంతను భాగ్యరాజ్ వంటి వాళ్లు సభ్యులు. సునీల్‌శెట్టి కెప్టెన్‌గా వ్యవహరించే బాలీవుడ్ లెవన్ టీమ్‌లో సల్మాన్‌ఖాన్, రితీశ్ దేశ్‌ముఖ్, సొహైల్‌ఖాన్, అర్బాజ్‌ఖాన్, సోనుసూద్, హర్మాన్ బవేజా తదితరులు సభ్యులు.

అభిమానులకీ, తమకీ ఆ క్రికెట్ లీగ్ ఆనందాన్నిస్తుందనీ, ఈ లీగ్ విషయం ప్రకటించగానే అన్నిచోట్ల నుంచీ మంచి స్పందన వచ్చిందనీ హీరో వెంకటేశ్ తెలిపారు. సీసీఎల్ పోటీలు జూన్ తొలి వారం నుంచి జరుగుతాయనీ, ఈ పోటీల్లో ఉత్తరాది నుంచి బాలీవుడ్ జట్టు, దక్షిణాది నుంచి తెలుగు, తమిళ, కన్నడ చిత్ర రంగాల జట్లు పాల్గొంటున్నాయని విష్ణు తెలిపారు. ఈ లీగ్ డైరెక్టర్లలో ఒకరైన రిథమ్ విష్ణు మాట్లాడుతూ ఈ పోటీలో ఆరు లీగ్ మ్యాచ్‌లు, ఓ ఫైనల్ మ్యాచ్ జరుగుతాయన్నారు

Ileana latest photos










Allu Arjun At Jockey Audio Release






Allu Arjun At Jockey Audio Release 27th FEB 2011, Allu Arjun Songs , Allu Arjun Hangama @ Jockey Audio Launch-Stills, Jockey Movie Audio Release Photo Gallery, Disc jockey , jockey telugu movie songs, Jockey Songs Download, Jockey Movie Photo Gallery, Jockey Movie Audio Release Photo Gallery, MOVIE JOCKEY telugu arya , allu arjun photos, allu arjun sneha reddy, allu arjun and sneha reddy engagement, allu arjun at pubs












Sridevi in NTR’s‘Shakthi’?


Producer C Ashwini Dutt is going to make a film with Junior NTR in the direction of Mehar Ramesh. The title ‘Shakthi’ is said to be in consideration and Ileana has been chosen to pair against Junior NTR as heroine for the film.

The latest buzz about this upcoming film is that movie makers are planning to rope in yesteryear’s heroine Sridevi for a key role i.e. NTR’s mother-in-law (Ileana’s mother). If she accepts, it would certainly be a wonderful combination. Already the trio – Junior NTR, Ashwini Dutt and Mehar Ramesh had given the successful ‘Kranthi’ before. Now, if Sri Devi and Ileana join their team, it is sure to get further strengthend.

This upcoming film will be made under C Aswini Dutt’s own production banner Vyjayanthi Movies with a huge budget of about 45 crores in 14 different locations of the world. Shooting is expected to begin in January 2010. Music will be done by Mani Sharma.

8న అభిమానులకు 'అల్లు'వారి రిసెప్షన్

అల్లుఅర్జున్ వివాహం స్నేహారెడ్డితో మార్చి 6న జరుగనున్న విషయం విదితమే. ఈ సందర్భంగా వచ్చేనెల 8న అభిమానుల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్‌ను అల్లువారి కుటుంబం ఏర్పాటు చేసింది.

హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరుగనున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్త అభిమానులు పాల్గొననున్నారు. వీరికోసం ప్రత్యేకంగా మధ్యాహ్న విందును ఏర్పాటు చేస్తున్నారు.

Sakthi Audio Launch Photos















Sakthi Audio Launch Photos, Sakthi Audio Launch Stills, Sakthi Audio Release Function, Jr NTR Shakthi Audio Function, Sakthi Audio Function Photos, Jr NTR

Shakthi Audio Release Function Photos














Shakthi Audio Release Function Photos

Friday, February 25, 2011

బ్రహ్మానందం శాడిజానికి బలి అయినటువంటి మరో కొత్త ఆంటీ..!!

డాక్టర్ బ్రహ్మానందం తన నటనతో యావత్ తెలుగు ప్రేక్షకులను ఆనంద డోలికల్లో తేలియాడిస్తున్న హాస్య నటుడు. అది వెండి తెరమీద. కానీ వెండి తెరమీద కంటే బయట బ్రహ్మానందం చాలా పెద్ద శాడిస్ట్ అని తన సహానటులను ముప్పు తిప్పులు పెడుతుండాడని అంటుంటారు. ఇలాంటి వార్తలు ఇటీవల కాలంలో బ్రహ్మానందం మీద చాలా వచ్చాయి. బ్రహ్మానందం ఖాతాలో ఇప్పుడు మరో నటి చేరింది. ఎవరా ఆనటి అనుకుంటున్నారా..

బ్రహ్మానందం శాడిజానికి బలయిన వాళ్శల్లో నటి హేమ కూడా ఉందని ఫిలింనగర్ సమాచారం. హేమ అతడు సినిమాలో బ్రహ్మానందం భార్యగా చేసినటువంటి నటన చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఈ మద్య కాలంలో హేమ తన సన్నిహితులతో బ్రహ్మానందానికి చుక్కులు చూపిస్తానని, నాకు నిద్రలేని రాత్రులు లేకుండా చేసినటువంటి బ్రహ్మానందానికి కూడా నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తానని అంటుందని సమాచారం.

హేమ బ్రహ్మానందంపై ఈరేంజిలో రివేంజి తీర్చుకుంటానని చెప్పడం వెనుక బ్రహ్మానందం తనని ఏరేంజిలో ఇబ్బంది పెట్టాడో ఊహించుకోవచ్చు. దీనిని బట్టి బ్రహ్మానందంపై ఎత్తుకు పైఎత్తులు వేసి బాగా ఏడిపించాలనే పనిలో పడిందని వినికిడి. ఇది ఇలా ఉండే గతంలో బ్రహ్మానందం తెలంగాణ నటులను అవమానిస్తున్నారని ఆయన ఆరోపించారు. బ్రహ్మానందంతో పాటు తాను కొన్ని సినిమాల్లో నటించినటువంటి శివారెడ్డిని దుర్భాషలాడారని, ఆ విషయం నిరూపించడానికి తమ వద్ద ఆధారాలున్నాయని ఆయన చెప్పారు. తెలంగాణకు చెందిన శివారెడ్డిని బ్రహ్మానందం అవమానించడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇది మాత్రమే కాకుండా జూ ఎన్టీఆర్ అదుర్స్ సినిమాలో నయనతారపై కన్నేసిన పాత్రలో డాక్టర్ బ్రహ్మానందం తెగ జీవించేశాడు..ఇది ఇలా ఉండగా నిజ జీవితంలో కూడా తనపై కన్నేసి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని అదుర్స్ సినిమాలో మరో హీరోయిన్ గా నటించినటువంటి షీలా ఓ మీడియా ప్రతినిధి ముందు తన భాదను చెప్పుకోకుందని సమాచారం. ఈ మాట ఆనోట ఈనోట వెళ్శి చివరకు బ్రహ్మానందం సన్నిహితుల దగ్గరకి చేరి అసలు విషయం ఏమైందని కనుక్కునేందుకు షీలా దగ్గరకు వెళ్తే అదుర్స్ సినిమా నుండి బ్రహ్మానందం తనపట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడో చెప్తూ ఎక్కడ కనిపిస్తే అక్కడ ద్వందార్దాలతో సైగలతో తనని ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడుతున్నాడని వాపోయిందంట.

Thursday, February 24, 2011

‘శ్రీరామరాజ్యం’ Sree Ramarajyam







మానవాళికి మార్గ్గదర్శకుడైన శ్రీరామచంద్రమూర్తి గొప్పతనాన్ని, ఆయన అవతార విశిష్టతను తెలపడమే ఈ చిత్ర సారాంశం. ప్రస్తుతం ఆర్‌ఎఫ్‌సీలో రాజప్రాసాదం, ఏకాంత మందిరం, కౌసల్యామందిరం మొదలగు సెట్స్ నిర్మాణం జరుగుతోంది. మార్చి 31 నుంచి షూటింగ్ పూర్తయ్యే వరకు నిరవధికంగా చిత్రీకరణ జరుపుతాం. ఇప్పటి వరకు మూడు పాటలు, లవకుశుల జననం, లక్ష్మణుడు అడవిలో సీతను వదిలేయడం, వాల్మీకి ఆమెకు ఆశ్రయం అందించడం లాంటి కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. రాముడుగా బాలయ్య నట విశ్వరూపాన్ని ఇందులో చూస్తారు. సీతగా నయనతార ఏంటి? అని విమర్శించిన వారే… ఆమె నటనను ప్రశంసిస్తారు.

వాల్మీకిగా పద్మవిభూషణ్ అక్కినేని నటన ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఇంకా లక్ష్మణుడిగా శ్రీకాంత్, భరతునిగా సాయికుమార్, చాకలి తిప్పడిగా బ్రహ్మానందం, జనకుడిగా మురళీమోహన్, భూదేవిగా జయసుధ, ఆంజనేయుడిగా విందు ధారాసింగ్, వశిష్ఠుడిగా సీనియర్ నటుడు బాలయ్య నటిస్తున్నారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఎనిమిది పాటలను ఇప్పటికే రికార్డ్ చేసిన విషయం తెలిసిందే. జూన్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని తెలిపారు.