

వెండితెరపై గర్వంగా తల ఎత్తుకొని ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించే స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ బుధవారం మాత్రం సిగ్గులు చిందిస్తూ.. తలదించుకొని ముసి ముసి నవ్వులు రువ్వుతూ కనిపించాడు. అమ్మ నిర్మల, నాన్న అల్లు అరవింద్, మావయ్య చిరంజీవి, అత్త సురేఖ కలిసి అమృత హస్తాలతో ‘పెండ్లికొడుకు’ని చేస్తుంటే సిగ్గుమొగ్గై పోయాడు బన్నీ (అర్జున్).
ఇన్నాళ్లు బ్యాచిలర్ లైఫ్‌ని ఎంజాయ్ చేసిన బన్నీ... లైఫ్‌లో బాధ్యతను పెంచుకొని ఈ నెల 6న ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బుధవారం అర్జున్ స్వగృహంలో ఈ నవ ‘వరుడు’ని పెళ్ళి కొడుకుగా ముస్తాబు చేశారు. కాగా, నేడు (గురువారం) అంగరంగ వైభవంగా ‘సంగీత్’ ఉత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇక అర్జున్ వివాహ వేడుకకు భారతదేశం నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన విశిష్ఠ అతిథులెందరో హాజరుకానున్నారు. ఆ తర్వాత 8న అభిమానుల కోసం హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో సతీసమేతంగా హాజరై మెగా అభిమానులకు విందు ఇవ్వనున్నారు అల్లు అర్జున్.
Happy married life !!!!!
ReplyDeletefrom sankar(vsp fancy association)