
రామ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'కందిరీగ'. శ్రీ సాయిగణేష్ ప్రొడక్ష్షన్స్ ప్రై.లి పతాకంపై బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు. కందిరీగ పేరుకు తగ్గట్టు రామ్ పాత్ర జోరుగా సాగుతూ ప్రేక్షకుల్లో హుషారు రేకెత్తించేలా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా గురించి రామ్ తన ట్విట్టర్‌లో ఈ విధంగా రాసుకున్నారు. ''సంగీత దర్శకుడు చక్రి బిజీగా ఉండటంతో స్వరాలు సమకూర్చే బాధ్యత తమన్‌కి అప్పగించారు. ప్రస్తుతం బాణీలు సిద్ధం చేయడంలో ఆయన నిమగ్నమయ్యారు. అందుకే ప్రస్తుతం నృత్య సాధన చేస్తున్నాను. ప్రేమ రక్షిత్ నృత్యరీతుల్ని సమకూర్చబోతు''న్నారు. సోనూసూద్, బ్రహ్మానందం, జయప్రకాశ్‌రెడ్డి, ధర్మవరపు, ఆహుతి ప్రసాద్, అజయ్, ప్రగతి, హేమ తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: ఆండ్రూ.
No comments:
Post a Comment