Voiceandhra.com

Voiceandhra.com
Andhra News,Telugu Cinema News,AP Political News,AP News

Monday, March 7, 2011

ఎంజాయ్ చేశా


వేసవి వస్తోందంటే చాలు... అందరికీ గుర్తొచ్చేది సెలవులే. పరీక్షలు పూర్తయ్యాక దాదాపు రెండు నెలల పాటు వచ్చే సెలవుల్లో ఎలా గడపాలా అని ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటుంటారు. మరి కొందరైతే తమ చిన్నతనంలో ఆ సెలవుల్ని ఎలా గడిపింది గుర్తు తెచ్చుకుని ఆ తీపి గర్తుల్ని ఫ్రెండ్స్‌తో పంచుకుంటారు.

తనకూ అలాంటి తీపి గుర్తులున్నాయని హీరోయిన్ బిందుమాధవి అంటోంది. ్త "చిన్నప్పుడు వేసవి సెలవులు అంటే చాలు... మా సొంతూరు మదనపల్లికి వెళ్లేవాళ్లం. అక్కడ పొలాల్లో ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా గడిపేవాళ్లం. ఆ సమయంలో నా ఆనందానికి హద్దులుండేవి కావు.

చెన్నైలో బీటెక్ చదివేటప్పుడు కూడా స్నేహితులతో కలిసి ఇక్కడికే వచ్చేదాన్ని. స్నేహితులంతా కలిసి హార్సిలీహిల్స్‌కెళ్లి ఎంజాయ్ చేసేవాళ్లం. ఇప్పుడు కూడా వేసవిలో అప్పుడప్పుడు హార్సిలీహిల్స్‌కి వెళుతుంటా. నాకు నచ్చిన బెస్ట్ హాలిడే స్పాట్ ఇదే'' అంటూ తన వేసవి వెకేషన్ గురించి వివరించింది ఈ ముద్దుగుమ్మ.

No comments:

Post a Comment