Voiceandhra.com

Voiceandhra.com
Andhra News,Telugu Cinema News,AP Political News,AP News

Tuesday, March 8, 2011

మహా 'శక్తి'


దుష్టశక్తిని ఎదుర్కోవాలంటే ప్రతీసారి దైవశక్తే దిగిరావక్కర్లెద్దు. ధైర్యంగా ఎదురుతిరిగే మానవ శక్తి సరిపోతుంది. దైవం ఆశీస్సులున్న ఆ శక్తిని మా సినిమాలో చూడొచ్చు అంటున్నారు మెహర్‌ రమేష్‌. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'శక్తి'. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇలియానా కథానాయిక. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు. ఈ నెల 30న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ సినిమా తమిళ భాషలోకీ అనువాదమవుతోంది. రెండు భాషల్లోనూ ఒకేసారి విడుదలవుతుంది. కేరళలో 'శక్తి' తమిళంలో తెర మీదకు వస్తుంది. నిర్మాత మాట్లాడుతూ ''శక్తి పీఠాలకు చెందిన కథ ఇది. అందుకే కథానుసారం వివిధ శక్తి పీఠాల్లో చిత్రీకరణ జరిపాం. మహా కుంభమేళాలో కోటి అరవై లక్షల మంది నడుమ చిత్రీకరణ చేశాం. ఇందులో ఎన్టీఆర్‌ పాత్ర భిన్న కోణాల్లో ఉంటుంది. ప్రస్తుతం రీరికార్డింగ్‌ పనులు జరుగుతున్నాయి. మణిశర్మ ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. 'శక్తి' నేపథ్య సంగీతంలో కొన్ని ప్రత్యేక వాయిద్యాల అవసరం వచ్చింది. దాంతో మణిశర్మ చెకొస్లోవేకియాలోని ఫ్రాగ్‌ వెళ్లారు. అక్కడ సౌండ్‌ మిక్సింగ్‌ చేస్తున్నార''న్నారు.

No comments:

Post a Comment