తమ తేజస్సును మించిన ఆ తారల ప్రకాశాన్ని చూసి ఆ రాత్రి... గగనంలోని నక్షత్రాలన్నీ అదృశ్యమయ్యాయి. ఆ పండు వెన్నెల సైతం వెండితెర వేల్పుల తళుకుల జిగేల్‌ను చూసి.. కాస్త చిన్నబోయింది. ఎవరన్నారు వర్ణాలు సప్తవర్ణాలని? ఈ తారల తళుకులు, కలర్‌ఫుల్ జిగేల్‌లు చూస్తే ఇంద్రదనస్సు కూడా తనలో మరిన్ని వర్ణాలు నింపుకుంటుందేమో అని
అనిపించింది. ఇదంతా గురువారం రాత్రి హైదరాబాదులోని ఓ స్టార్ హోటల్‌లో ఆవిష్కృతమయిన అరుదైన ఘట్టం.
యువ కథానాయకుడు అల్లు అర్జున్ ఈ నెల 6న‘ స్నేహ’ హస్తం అందుకొని ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఓ హోటల్‌లో ఏర్పాటుచేసిన ‘సంగీత్’ వేడుకలో సినీ తారలు హల్‌చల్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, మహేష్‌లు సతీసమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనగా, వెంకటేష్, రామ్‌చరణ్, చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత, అల్లుడు విష్ణుప్రసాద్, శర్వానంద్, శ్రీయ, ప్రియా ఆనంద్ తదితరులు ఈ వేడుకలో తళుక్కున మెరిశారు.
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు...
ఈ వేడుకలో కాబోయే భార్యాభర్తలు అల్లు అర్జున్, స్నేహారెడ్డి ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు..’ పాటకు డాన్స్ చేశారని...రామ్ చరణ్, బన్నీ, ధరమ్‌తేజ ‘రారా బంగారం..’కి డాన్స్ చేశారని బన్నీ సోదరుడు అల్లు శిరీష్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ వేడుకలో పలువురు తారలు చిందులు వేసి.. ఈల వేసి గోల చేసి వుంటారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

No comments:
Post a Comment