సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కర్టెన్ రైజర్ మ్యాచ్ ఆడేందుకు నేడు (శుక్రవారం) తారలు విశాఖ చేరుకోనున్నారు. ఈ మ్యాచ్ శనివారం సాయంసంద్యలో ప్రారంభమై డేనైట్‌గా సాగనుండగా, నేడు స్థానికంగా తారలంతా గల్లీ క్రికెట్ ఆడి, విశాఖ వాసుల్ని అలరించనున్నారు.
భారతదేశంలోనే తొలిసారిగా ఐిపీఎల్ తరహాలో తారల జట్లతో ట్వంటీ20 మ్యాచ్‌లు నిర్వహించనుండగా కర్టెన్ రైజర్ మ్యాచ్ విశాఖలోని వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియం వేదికగా నిర్వహించ నున్నారు. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్ జట్లు ఈ పోటీల్లో ఆరు సూపర్ లీగ్ మ్యాచ్‌లతో పాటు ఓ ఫైనల్ మ్యాచ్ నిర్వహించనుండగా ఈ పోటీలు జూన్ మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి.
గల్లీక్రికెట్
విశాఖలో బాలీవుడ్ హీరోస్ జట్టుతో సౌత్ సూపర్ స్టార్స్ జట్టు శనివారం తలపడనుండగా ఈ పోటీలో పాల్గొనున్న సూపర్‌స్టార్‌లంతా నేడే విశాఖవాసుల్ని అలరించనున్నారు. స్థానిక కళాశాలలో గల్లీ క్రికెట్ ఆడి హల్‌చల్ చేయనున్నారు. ఇప్పటికే పోలీస్ అధికారుల నుంచి పర్మిషన్ తీసుకున్నామని టోర్ని డైరక్టర్ తిరుమల రెడ్డి తెలిపారు. సరదాగా సాగనున్న ఈ గల్లీ క్రికెట్‌లో విద్యార్థులు సయితం ఉత్సాహంగా పాల్గొనేందుకు ఏర్పాటు జరుగుతున్నా యన్నారు. ‘ఈ సేవ’ కేంద్రాల ద్వారా టికెట్లు అమ్మకాలు ఊపందుకున్నాయి.
బుధవారం తారామణులు శ్రీయ, రిచా విశాఖలో టిక్కెట్ల వేలంను నిర్వహించి, సంతకాలు చేసి విశాఖ వాసుల్ని అలరించారు. బాలీవుడ్ జట్టుకి జెనీలియా, సోనాక్షి టీమ్ అంబాసిడర్లుగా వ్యవహరించనుండగా, దక్షిణ భారత జట్లకు శ్రీయ, తాప్సి, సమంత, ప్రియమణి, చార్మి, ఆంద్రిత, రాగిణి... టీమ్ అంబాసిడర్లుగా వ్యవహరించడమే కాక కర్టెన్ రైజర్ పోటీల్లో గ్రౌండ్‌లోనూ అభిమానుల్ని అలరించనున్నారు.
బాలీవుడ్ హీరోస్
సునీల్ శెట్టి(కెప్టెన్), సల్మాన్ ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్, సోహైల్ ఖాన్, అర్బజ్‌ఖాన్, సోనూసూద్, హర్మన్ బవేజా, కబీర్ సదానంద్, షబ్బీర్ అహ్లూవాలియా, అంగద్ బేడీ, అపూర్వ లఖియా, ఆశిష్ చౌదరి, వికాస్ కలాంత్రి అనుష్క్‌చౌదరి.
సౌత్ సూపర్‌స్టార్స్
వెంకటేష్(కెప్టెన్), సూర్య, సుదీప్(వైస్ కెప్టెన్), శరత్‌కుమార్, మంచు విష్ణు, సిద్ధార్థ్ తారకరత్న, అబ్బాస్, ఆర్య,శ్యామ్, శ్రీజ, థరువ్, విక్రాంత్, శంతన్‌భాగ్యరాజ్.
No comments:
Post a Comment