Voiceandhra.com

Voiceandhra.com
Andhra News,Telugu Cinema News,AP Political News,AP News

Thursday, March 3, 2011

బాలకృష్ణ కొత్త చిత్రం

బాలకృష్ణ, లక్ష్మీరాయ్ జంటగా శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై పరుచూరి మురళి దర్శకత్వంలో ఎంఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన ఒక షెడ్యూల్ పూర్తయింది.ఈ సందర్భంలో నిర్మాత ఎంఎల్ కుమార్ చౌదరి మాట్లాడుతూ- వైజాగ్‌లో నిర్మించిన భారీ సెట్‌లో 25 రోజులు షూటింగ్ చేశాం. ఇక్కడ వేణుమాధవ్, బ్రహ్మానందం, లక్ష్మీరాయ్‌లపై హాస్య సన్నివేశాలు, రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో ఫైట్ సీన్స్ చిత్రీకరించాం. ఇవన్నీ చాలా బాగా వచ్చాయి. మళ్లీ రామోజీ ఫిలింసిటీలో మరో షెడ్యూల్ ప్రారంభిస్తాం. ఈ షెడ్యూల్‌తో చిత్రం పూర్తవుతుంది. మొత్తం ఐదు పాటలను రికార్డు చేశాం. త్వరలో చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు తెలియజేస్తామని తెలిపారు. జయసుధ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్‌రాజ్, ఎమ్మెస్ నారాయణ, ఆదిత్య మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కల్యాణిమాలిక్, నిర్మాత: ఎమ్‌ఎల్‌కుమార్ చౌదరి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పరుచూరి మురళి.

No comments:

Post a Comment