
ఎన్టీఆర్ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'శక్తి'. మెహర్ రమేష్ దర్శకుడు. సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం బిజినెస్ పరంగానూ సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తోంది. 'శక్తి' పాటల్ని ఈ నెల 27న హైదరాబాద్‌లోని లలితకళా తోరణంలో అభిమానుల సమక్షంలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆవిష్కరిస్తారు. నిర్మాత సి.అశ్వనీదత్ మాట్లాడుతూ "మా సంస్థ నుంచి విడుదలైన చిత్రాలన్నీ సంగీతపరంగా పెద్ద విజయాన్ని మూటగట్టుకున్నాయి.
మణిశర్మ ఈ చిత్రానికి కూడా మంచి మ్యూజిక్‌ను అందించారు. పాటల్ని ఈ నెల 27న ఘనంగా విడుదల చేయనున్నాం'' అని అన్నారు. దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ "మణిశర్మ అందించిన బాణీలు అలరిస్తాయి. సినిమాకి సంగీతం పెద్ద ప్లస్ అవుతుంది. సినిమా తప్పక సెన్సేషన్‌ను క్రియేట్ చేస్తుంది'' అని చెప్పారు.
ఇలియానా, మంజరి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మంజు భార్గవి, సోనూసూద్, ప్రభు, జాకీ ష్రాఫ్, పూజా బేడీ, సాయాజీ షిండే, నాజర్, బ్రహ్మానందం, అలీ, ఎం.ఎస్.నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కృష్ణభగవాన్, వేణుమాధవ్, శ్రీనివాస్‌రెడ్డి, డానియల్, విద్యుత్, రజా, ప్రగతి, పవిత్రాలోకేష్ తదితరులు ఇతర పాత్రధారులు.
No comments:
Post a Comment