మానవాళికి మార్గ్గదర్శకుడైన శ్రీరామచంద్రమూర్తి గొప్పతనాన్ని, ఆయన అవతార విశిష్టతను తెలపడమే ఈ చిత్ర సారాంశం. ప్రస్తుతం ఆర్‌ఎఫ్‌సీలో రాజప్రాసాదం, ఏకాంత మందిరం, కౌసల్యామందిరం మొదలగు సెట్స్ నిర్మాణం జరుగుతోంది. మార్చి 31 నుంచి షూటింగ్ పూర్తయ్యే వరకు నిరవధికంగా చిత్రీకరణ జరుపుతాం. ఇప్పటి వరకు మూడు పాటలు, లవకుశుల జననం, లక్ష్మణుడు అడవిలో సీతను వదిలేయడం, వాల్మీకి ఆమెకు ఆశ్రయం అందించడం లాంటి కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. రాముడుగా బాలయ్య నట విశ్వరూపాన్ని ఇందులో చూస్తారు. సీతగా నయనతార ఏంటి? అని విమర్శించిన వారే… ఆమె నటనను ప్రశంసిస్తారు.
వాల్మీకిగా పద్మవిభూషణ్ అక్కినేని నటన ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఇంకా లక్ష్మణుడిగా శ్రీకాంత్, భరతునిగా సాయికుమార్, చాకలి తిప్పడిగా బ్రహ్మానందం, జనకుడిగా మురళీమోహన్, భూదేవిగా జయసుధ, ఆంజనేయుడిగా విందు ధారాసింగ్, వశిష్ఠుడిగా సీనియర్ నటుడు బాలయ్య నటిస్తున్నారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఎనిమిది పాటలను ఇప్పటికే రికార్డ్ చేసిన విషయం తెలిసిందే. జూన్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని తెలిపారు.
No comments:
Post a Comment