Voiceandhra.com

Voiceandhra.com
Andhra News,Telugu Cinema News,AP Political News,AP News

Monday, February 14, 2011

అదుర్స్ సినిమా నుంచే నాపై బ్రహ్మానందం కన్నేశాడంటున్న హీరోయిన్


ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో బ్రహ్మానందం మీద తెగ ఆరోపణలు చేస్తున్నారు సినిమా ప్రముఖులు. ఈకోవలోకి కొత్తగా మరో హీరోయిన్ ఇటీవలే చేరింది. జూ ఎన్టీఆర్ అదుర్స్ సినిమాలో నయనతారపై కన్నేసిన పాత్రలో డాక్టర్ బ్రహ్మానందం తెగ జీవించేశాడు..ఇది ఇలా ఉండగా నిజ జీవితంలో కూడా తనపై కన్నేసి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని అదుర్స్ సినిమాలో మరో హీరోయిన్ గా నటించినటువంటి షీలా ఓ మీడియా ప్రతినిధి ముందు తన భాదను చెప్పుకోకుందని సమాచారం.ఈ మాట ఆనోట ఈనోట వెళ్శి చివరకు బ్రహ్మానందం సన్నిహితుల దగ్గరకి చేరి అసలు విషయం ఏమైందని కనుక్కునేందుకు షీలా దగ్గరకు వెళ్తే అదుర్స్ సినిమా నుండి బ్రహ్మానందం తనపట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడో చెప్తూ ఎక్కడ కనిపిస్తే అక్కడ ద్వందార్దాలతో సైగలతో తనని ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడుతున్నాడని వాపోయిందంట. మొన్నిటికి మొన్న హాస్యనటుడు శివారెడ్డి కూడా బ్రహ్మానందం తనని వేధిస్తున్నాడంటూ మీడియా ముందు వాపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుండి బైటకు వచ్చేందుకు బాధ పడుతున్న బ్రహ్మానందంపై షీలా ఇలాంటి ఆరోపణలు చేయడంతో ఇండస్ట్రీ మొత్తం ముక్కున వేలేసుకుంది..ఇక మీదటైనా బ్రహ్మానందం ఇలాంటి పనులు మానుకోవాలని తన సన్నిహితులు హెచ్చరించినట్లు సమాచారం.

No comments:

Post a Comment