
నరేష్, రీతూ బర్మేజా జంటగా వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మించిన ‘అహ నా పెళ్లంట’ చిత్రం మార్చి 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ-‘‘ఈ చిత్రంలో నాకిష్టంలేని పెళ్లి చేస్తారు. ఈ కారణంగా నా ఏడుపు నేను ఏడుస్తుంటే... ప్రేక్షకులు మాత్రం హాయిగా నవ్వుకుంటారు. ఈ చిత్రంలో కామెడీ అలా ఉంటుంది. ఈ తరహా కామెడీ చేయడం నాకిదే మొదటిసారి. నా పాత్రతో పాటు చిత్రంలో ఉన్న ఇతర పాత్రలు కూడా ప్రేక్షకులను నవ్విస్తాయి’’ అన్నారు. ‘‘చక్కని కథాంశంతో రూపొందించిన ఈ చిత్రం ఆడియో విజయం సాధించడం ఆనందంగా ఉంది. సినిమా కూడా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అని సుంకర రామబ్రహ్మం అన్నారు. అన్ని వర్గాలవారిని అలరించేలా ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు తెలిపారు. |
No comments:
Post a Comment