Voiceandhra.com

Voiceandhra.com
Andhra News,Telugu Cinema News,AP Political News,AP News

Sunday, February 13, 2011

ఎదురులేని ఎన్టీఆర్ శక్తి


35ఏళ్ల క్రితం మహానటుడు ఎన్టీఆర్ హీరోగా ‘ఎదురులేని మనిషి’ తో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది ‘వైజయంతీ మూవీస్’ సంస్థ. ఈ సుదీర్ఘప్రస్థానంలో ఎన్నో సంచలనాత్మక చిత్రాలను నిర్మించి, అగ్ర నిర్మాతగా తన ప్రాభవాన్ని చాటుకుంటూ వచ్చారు ఆ సంస్థ అధినేత సి.అశ్వనీదత్. తెలుగు చిత్ర పరిశ్రమలోని దాదాపు అందరు అగ్ర హీరోలతో సినిమాలను నిర్మించిన ఘనత ఆయన సొంతం. అటువంటి ఖ్యాతి పొందిన వైజయంతీ బేనరులో ఆయన నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘శక్తి’. జూనియర్ ఎన్టీఆర్ ‘శక్తి’వంతమైన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి మెహర్మ్రేష్ దర్శకుడు. మెహర్ గతంలో ఇదే బేనరులో ‘కంత్రి’ని, మరో బేనరులో ‘బిల్లా’ని తెరకెక్కించి అగ్ర దర్శకుల వరుసలో చేరిన విషయం తెలిసిందే. మరోసారి ఆయన దర్శకత్వంలో అత్యున్నత సాంకేతిక విలువలతో, కోట్ల రూపాయలు వెచ్చించి తమ బేనరులో మహా‘శక్తి’గా ఈ సినిమా నిర్మాణానికి పూనుకున్నారు అశ్వనీదత్. మన దేశంలోని పలు అందమైన ప్రదేశాలతో పాటు, ఈజిప్ట్, లండన్, దుబాయ్ వంటి పలు ఇతర దేశాల్లో 13 నెలల పాటు శ్రమించి, ఏ విషయంలోనూ రాజీ పడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారాయన. తొమ్మిది సంవత్సరాల పిల్లల నుంచి తొంభైఏళ్ల పెద్దవారి వరకు అలరించే విధంగా ఈ సినిమా ఉండాలన్నదే ధ్యేయంగా దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ‘శక్తి’ చిత్రానికి సంబంధించిన స్టిల్స్‌ను తొలిసారిగా ఆదివారం మీడియాకు విడుదల చేశారు దర్శక, నిర్మాతలు. మార్చి 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తామని ఈ సందర్భంగా సి.అశ్వనీదత్ వెల్లడించారు. గ్లామర్ క్వీన్ ఇలియానా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి తెరవెనుక సత్యానంద్, సమీర్‌రెడ్డి, మణిశర్మ, యండమూరి వీరేంద్రనాథ్, జె.కె.భారవి, తోట ప్రసాద్, డి.ఎస్.కన్నన్ వంటి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు.

No comments:

Post a Comment