Voiceandhra.com

Voiceandhra.com
Andhra News,Telugu Cinema News,AP Political News,AP News

Saturday, February 19, 2011

ప్రేమలో కొత్త కోణం





అరుంధతి సినిమాలో చిన్నారి జేజమ్మగా కనిపించిన అమ్మాయి గుర్తుందా..? దివ్య. చారెడంత కళ్లు వేసుకొని అందర్నీ ఆకట్టుకొంది. ఆ అమ్మాయి ఇప్పుడు కథానాయికగా మారింది. నందు, దివ్య జంటగా శ్రీరాజ రాజేశ్వరి సోమేశ్వర ప్రొడక్షన్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. గోవింద్‌ వరహా దర్శకత్వం వహిస్తారు. పి.ఎన్‌.తిలక్‌ నిర్మాత. ఈ నెల 24 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తారు. నిర్మాత మాట్లాడుతూ ''ఇదో ప్రేమ కథ. యువతీయువకుల మధ్య ఉండే ఆకర్షణ, స్నేహం, ప్రేమ... వీటిలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాం. సన్నివేశాలన్నీ సహజంగా ఉంటాయి. మనసుకి హత్తుకొంటాయి. చిన్ని చరణ్‌ సంగీతాన్ని అందిస్తార''న్నారు. సమర్పణ: కె.నాగిరెడ్డి.

No comments:

Post a Comment