
బాలీవుడ్‌లో 'గజిని' సినిమాతో అడుగుపెట్టిన నాయిక అసిన్. ఇప్పుడామె సరికొత్త పాత్రల్లో కనిపించేందుకు సిద్ధమవుతోంది. అందాల ప్రదర్శనకు ఎలాంటి అడ్డు చెప్పకుండా ఏకంగా బికినీలో దర్శనమీయబోతోంది. అక్షయ్ కుమార్, దీపికా పదుకొణే జంటగా గత ఏడాది నటించిన 'హౌస్‌ఫుల్' సినిమాకు తాజాగా సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇందులో అక్షయ్ కుమార్ సరసన అసిన్‌ను ఎంపిక చేశారు. ఈ చిత్రంలోనే ఆమె బికినీలో కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. సాజిద్ ఖాన్ దర్శకత్వం వహిస్తారు. సాజిద్ నదియడ్‌వాలా నిర్మాత. ఇటలీ, గ్రీస్‌లో అధిక భాగం చిత్రీకరణ ఉంటుందని సమాచారం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
No comments:
Post a Comment