
ఉత్తరాది, దక్షిణాది సినీ తారలు ఆడనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 'కర్టెన్ రైజర్' గేమ్ ఈ నెల 5న విశాఖపట్నంలో జరుగనున్నది. ఈ మ్యాచ్‌లో బాలీవుడ్ తారల జట్టుతో, దక్షిణాది తారల జట్టు తలపడనున్నది. ఈ సంగతిని ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో సోమవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో టాలీవుడ్ టీమ్ యజమాని హీరో మంచు విష్ణు తెలిపారు. సౌత్ సూపర్‌స్టార్స్ లెవన్ జట్టుకి హీరో వెంకటేశ్ కెప్టెన్‌గా, కన్నడ హీరో సుదీప్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
ఈ జట్టులో టాలీవుడ్‌కు చెందిన మంచు విష్ణు, సిద్ధార్థ్, తరుణ్, తారకరత్న, తమిళ హీరోలు సూర్య, శరత్‌కుమార్, అబ్బాస్, ఆర్య, శ్యామ్, శంతను భాగ్యరాజ్ వంటి వాళ్లు సభ్యులు. సునీల్‌శెట్టి కెప్టెన్‌గా వ్యవహరించే బాలీవుడ్ లెవన్ టీమ్‌లో సల్మాన్‌ఖాన్, రితీశ్ దేశ్‌ముఖ్, సొహైల్‌ఖాన్, అర్బాజ్‌ఖాన్, సోనుసూద్, హర్మాన్ బవేజా తదితరులు సభ్యులు.
అభిమానులకీ, తమకీ ఆ క్రికెట్ లీగ్ ఆనందాన్నిస్తుందనీ, ఈ లీగ్ విషయం ప్రకటించగానే అన్నిచోట్ల నుంచీ మంచి స్పందన వచ్చిందనీ హీరో వెంకటేశ్ తెలిపారు. సీసీఎల్ పోటీలు జూన్ తొలి వారం నుంచి జరుగుతాయనీ, ఈ పోటీల్లో ఉత్తరాది నుంచి బాలీవుడ్ జట్టు, దక్షిణాది నుంచి తెలుగు, తమిళ, కన్నడ చిత్ర రంగాల జట్లు పాల్గొంటున్నాయని విష్ణు తెలిపారు. ఈ లీగ్ డైరెక్టర్లలో ఒకరైన రిథమ్ విష్ణు మాట్లాడుతూ ఈ పోటీలో ఆరు లీగ్ మ్యాచ్‌లు, ఓ ఫైనల్ మ్యాచ్ జరుగుతాయన్నారు
No comments:
Post a Comment