Voiceandhra.com

Voiceandhra.com
Andhra News,Telugu Cinema News,AP Political News,AP News

Monday, February 21, 2011

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్




టసీ నేపథ్యంలో ఎస్.ఎస్.రాజమౌళి తీర్చిదిద్దిన యమదొంగ, మగధీర చిత్రాలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో తెలిసిందే. ఇప్పుడు ఆ రకంగా మరో సంచలనానికి తెరతీశారు రాజమౌళి. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా ఓ భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో... ఆర్కా మీడియా పతాకంపై, యార్లగడ్డ శోభు, దేవినేని ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఈ సినిమా విశేషాలను శుక్రవారం విలేకరులకు తెలిపారు. రాజమౌళి మాట్లాడుతూ- ‘‘ఇది ఫాంటసీ చిత్రం. హిస్టారికల్ కావచ్చు, జానపదం కావచ్చు, పౌరాణికం కావచ్చు. లేకపోతే వైవిధ్యంగా ఈ మూడు నేపథ్యాలు ఇందులో ఉండొచ్చు. ఇప్పుడే ఈ సినిమా గురించి ఇతమిద్థంగా చెప్పలేను. కాకపోతే ఒక్కటి మాత్రం చెప్పగలను. ఇది నా ఫాంటసీ దాహాన్ని తీర్చే సినిమా. ఈ చిత్రం పూర్తి కావడానికి ఓ ఏడాది పట్టొచ్చు.

ప్రస్తుతం ప్రీ విజువలైజేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘మగధీర’ కంటే హై బడ్జెట్‌లో ఈ చిత్రం రూపొందనుంది. విజువల్ ఎఫెక్ట్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఉన్న కథ ఇది. తెలుగు, తమిళ భాషల్లో సినిమా ఉంటుంది. సెప్టెంబరులో సెట్స్ మీదకు వెళుతుందీ సినిమా’’ అని తెలిపారు. ‘‘రాఘవేంద్రరావుగారి బ్యానర్‌లో సినిమా చేయడం నా అదృష్టం. రెండేళ్ల క్రితమే ఈ సినిమా గురించి చెప్పారు రాజమౌళి. మళ్లీ నా జీవితంలో ఇలాంటి సినిమా రావచ్చు, రాకపోవచ్చు.

అందుకే నా శక్తినంతా క్రోడీకరించి ఈ పాత్ర చేస్తా’’ అని ప్రభాస్ చెప్పారు. ఈ కథ తనకు తెలీదని, కథలోని గొప్పతనం తెలిస్తే దానిపై ప్రత్యేకంగా కసరత్తులు మొదలుపెడతానని సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కె.కృష్ణమోహన్‌రావు, ఆర్ట్ డైరె క్టర్ రవీందర్, నిర్మాతలు యార్లగడ్డ శోభు, దేవినేని ప్రసాద్ కూడా పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: పీటర్ హెయిన్స్, గ్రాఫిక్స్: మకుట.

No comments:

Post a Comment