
శ్రీరామునిగా నందమూరి బాలకృష్ణ, వాల్మీకిగా అక్కినేని నాగేశ్వరరావు నటిస్తోన్న చిత్రం 'శ్రీరామరాజ్యం'. బాపు దర్శకత్వంలో సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీతగా నయనతార, లక్ష్మణునిగా శ్రీకాంత్, భరతునిగా సాయికుమార్ నటిస్తున్నారు. ఇప్పటికి 35 శాతం సినిమా పూర్తయ్యింది.
మార్చి 25 నుంచి సినిమా పూర్తయ్యేదాకా నిర్విరామంగా షూటింగ్ చేయడానికి ప్లాన్ చేశామని నిర్మాత సాయిబాబు తెలిపారు. "వాల్మీకి ఆశ్రమం సెట్‌లో మూడు పాటలు, కొన్ని సన్నివేశాలు తీశాం. లవకుశుల జననం, సీతను లక్ష్మణుడు అడవిలో వదిలేయడం, వాల్మీకి ఆమెని ఆదరించడం మొదలైనవి తీశాం. మరోవైపు రామోజీ ఫిల్మ్‌సిటీలో రాజదర్బారు, ఏకాంత మందిరం, కౌసల్య మందిరం వంటి సెట్స్ నిర్మాణం జరుగుతోంది.
No comments:
Post a Comment