తెలుగు సినిమాకి రాజు ప్రిన్స్ మహేష్, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రూపోందుతున్న దూకుడు సినిమాకి సంబంధించినటువంటి ఎంట్రీ సాంగ్ ఈనెల 24వ తేదీ నుండి చెన్నైలో జరుగనుంది. ఈపాటకి ప్రముఖ డాన్స్ మాస్టర్ రాజు సుందరం నృత్యరీతుల్ని సమకూరుస్తున్నారు. ఈపాట విషయానికి వస్తే నీ సాహాసం దావానలం.. సరాసరి వచ్చి ఎదుటపడి తెగబడతూ రెచ్చిపో ..పిడికిలినే పిడుగుల్లా కలబడనీ ..నీ దూకుడుకి సాటి ఎవడురా అంటే సాగే పల్లవికి 23వ తారీఖు రిహార్సల్స్ జరుగుతాయని తెలిపారు.
ఆతర్వాత 24 నుండి మూడు రోజులపాటు వివిధ లోకేషన్స్‌లో షూట్ చేసి పాటను పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. 24వ తారీఖున ఇన్నోర్ హార్బర్, 25న బిన్నీ మిల్స్, 26న పాండిచ్చేరి ఫోర్ట్‌లో ఎంట్రీ సాంగ్‌ను చిత్రీకరించునున్నారు. ఇప్పటికే దూకుడు సినిమా షూటింగ్ చాలా డిలే అవ్వడంతో షూటింగ్‌ని శరవేగంగా పూర్చి చేయడానికి దూకుడుగా యూనిట్ అంతా సిద్దంగా ఉందన్నారు.
ఇది మాత్రమే కాకుండా సమ్మర్‌లో వస్తాడనుకున్న మహేష్ బాబు సమ్మేవల్ల జూన్, జులైలోకి వెళ్శిపోవడంతో అభిమానులు కోంత నీరసించిపోయారని సమాచారం. ఏది ఐతేనేం జూన్, జులైలో అన్నా దూకుడు సినిమా విడుదలైతే చూడడానికి అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
No comments:
Post a Comment